తాజా వార్తలు బడ్జెట్లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం...         ఈ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తోంది...         తారీకు : 08-12-2022
 
Asia Cup 2022: ఇదేం బౌలింగ్‌ రా బాబు.. అప్పుడు సూర్య! ఇప్పుడు కుష్‌దిల్‌..
ఆసియాకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 156 పరుగుల తేడాతో హాంగ్‌ కాంగ్‌ ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో టోర్నీ నుంచి హాంగ్‌ కాంగ్‌ ఇంటిముఖం పట్టగా.. పాకిస్తాన్‌ సూపర్‌-4లో అడుగుపెట్టిం‍ది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.

పాక్‌ బ్యాటర్లలో మహ్మద్‌ రిజ్వాన్‌(57 బంతుల్లో 78 పరుగులు నాటౌట్‌), ఫఖర్‌ జమాన్‌(53) పరుగులతో రాణించగా.. అఖర్లో కుష్‌దిల్‌ షా (15 బంతుల్లో 35 పరుగులు నాటౌట్‌, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ అఖరి ఓవర్‌ వేసిన అజాజ్ ఖాన్ బౌలింగ్‌లో.. కుష్‌దిల్‌ షా ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు. దాంట్లో నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హాంగ్‌ కాంగ్‌ బౌలర్‌ ఆర్షద్‌ వేసిన అఖరి ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఏకంగా 26 పరుగులు రాబట్టాడు.

అతడు కూడా నాలుగు భారీ సిక్సర్లతో ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఇక 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్‌ కాంగ్‌ కేవలం 38 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ నాలుగు వికెట్లు తీయగా.. మహ్మద్‌ నవాజ్ ‌ మూడు, నసీమ్‌ షా రెండు, దహినీ ఒక వికెట్‌ తీశారు. ఇక సూపర్‌-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబర్‌ 4న) భారత్‌తో పాకిస్తాన్‌ తలపడనుంది.
Kho-Kho League: ఫైనల్లో తెలుగు యోధాస్‌
Japan Open: పోరాడి ఓడిన ప్రణయ్‌
Asia Cup 2022: ఇదేం బౌలింగ్‌ రా బాబు.. అప్పుడు సూర్య! ఇప్పుడు కుష్‌దిల్‌..
ఆరు సిక్సర్లతో ప్రపంచ రికార్డు సాధించిన అఫ్గన్‌ బ్యాటర్‌...
పాకిస్తాన్‌పై చేలరేగి! శభాష్‌ హార్దిక్‌...
పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్‌..
*** అబుదాబి మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ విజేత అర్జున్‌...
* ఐడీకార్డుపై బికినీతో ఫోటో.. షాకైన టెన్నిస్‌​ స్టార్‌
తెలుగు యోధాస్‌కు షాకిచ్చిన చెన్నై క్విక్‌ గన్స్‌ ‌
MS Dhoni: భారతీయుడినైనందుకు నా జన్మ ధన్యమైంది: ధోని
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :163428                      Contact Us || admin@rajadhanivartalu.com