తాజా వార్తలు బడ్జెట్లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం...         ఈ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తోంది...         తారీకు : 08-12-2022
 
స్వ‌చ్ఛాంధ్ర‌ప్ర‌దేశే మ‌న లక్ష్యం
స్వ‌చ్ఛాంధ్ర‌ప్ర‌దేశే మ‌న లక్ష్యం

రాష్ట్రంలోని అందరు మున్సిపల్ కమిషనర్ లతో సమీక్షా సమావేశం.

స్వచ్ఛ నగరాల కోసం అధికారులు అంకితభావం తో పనిచేయాలి.

రాష్ట్రపుర‌పాల‌క‌, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూల‌పు సురేష్‌.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను స్వచ్ఛాంధ్ర‌ప్ర‌దేశ్ గా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యంగా మ‌నంద‌రం ప‌నిచేయాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధిశాఖా మాత్యులు డాక్టర్ ఆదిమూల‌పు సురేష్ ఉద్ఘాటించారు. స్వ‌చ్ఛ‌న‌గ‌రాల అభ్యున్న‌తిలో మ‌న రాష్ట్రం మ‌రింత ఖ్యాతి గ‌డించేలా అధికార యంత్రాంగం ముందుకుసాగాల‌ని పిలుపునిచ్చారు. పుర‌పాల‌క మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం విజ‌య‌వాడ తుమ్మ‌లప‌ల్లి క‌ళాక్షేత్రంలో వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ - జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్ దిశ‌లపై రాష్ట్రంలోని అన్ని న‌గ‌ర పాల‌క సంస్థ‌ల క‌మిష‌న‌ర్లు మ‌రియు ఉన్న‌తాధికారుల‌తో క్షేత్ర‌స్థాయి స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది.

ఈ స‌మావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి సురేష్ స్వ‌చ్ఛ నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌కు దిశా నిర్ధేశం చేశారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చేతుల మీదుగా క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్(క్లాప్‌) కార్య‌క్ర‌మం ప్రారంభించినప్పటి నుంచి పుర‌పాల‌క‌శాఖ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌లో కొత్త సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చింద‌న్నారు. ప్ర‌ధానంగా రాష్ట్రవ్యాప్తంగా లోక‌ల్ బాడీల‌ను ఏర్పాటు చేసి 2,253 చెత్త సేక‌ర‌ణ వాహ‌నాల‌తో త‌డి, పొడి చెత్తను నిత్యం సేక‌రించటం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌తి ఇంటికీ త‌డి, పొడి చెత్త‌ను నిపేందుకు బుట్ట‌ల‌ను పంపిణీ చేసి వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ఒక క్ర‌మాన్ని తీసుకురాగ‌లిగామ‌ని అన్నారు. డోర్ టు డోర్ చెత్త సేక‌ర‌ణ‌లో నూరుశాతం ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌టం జ‌రిగింద‌న్నారు. త‌డి, పొడి చెత్త‌ను వేరుచేయ‌టంలో స‌ఫ‌లీకృతం కాగ‌లిగామ‌న్నారు. వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌లో జాతీయ‌స్థాయిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక గుర్తింపు తీసుకువ‌చ్చిన ఘ‌న‌త ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాల‌క‌శాఖ ద‌క్కించుకుంద‌న్నారు. న‌గ‌రాలు మ‌రియు ప‌ట్ట‌ణాల‌లో పార‌శుద్ధ్య నిర్వ‌హ‌ణ‌పై ఎప్ప‌టిక‌ప్పుడు దృశ్య‌మాద్య‌మాల ద్వారా ప‌ర్య‌వేక్ష‌ణ జ‌రుగుతొంద‌న్నారు. వాహ‌నం చెత్త సేక‌రించిన త‌దుప‌రి అది డంపింయార్డ్‌కు చేరుకు వ‌ర‌కు జీపీఎస్ ద్వారా క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌వేక్ష‌ణ ద్వారా స్వ‌చ్ఛ ల‌క్ష్యాన్ని సాధించగ‌లుగుతున్నామ‌న్నారు. ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ట్రంలోని పలు పట్టణాలు దక్కించుకోవటం ఆనందదాయకం అన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయి లో రాష్ట్రానికి గుర్తింపు దక్కేలా అధికారులు మరింత కృషి చేయాలన్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేసే ఆలోచ‌న‌లో భాగంగా విశాఖ‌ప‌ట్నం, రాజమండ్రి, గుంటూరు న‌గ‌రాల‌లో ప్లాంట్ల నిర్మాణ ప్ర‌తిపాద‌న‌ల‌ను పుర‌పాల‌క‌శాఖ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వై.శ్రీ‌ల‌క్ష్మి మంత్రికి నివేదించారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని అదేవిధంగా మ‌ధ్య త‌ర‌గ‌తి ఆదాయా స‌మూహాలు సొంతింటి క‌ల‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డానికి జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్షిప్ల‌ను నెల‌కొల్పాల‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు ల‌క్షించార‌ని ఇందులకుగాను న‌గ‌రాలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో గుర్తించిన లే ఔట్ లలో పనుల పురోగతి సాధించేలా అధికారులు చర్యలు చేపట్టాల‌న్నారు. భూ సేకరణ జరగని చోట తక్షణమే భూమి గుర్తించి సేకరించాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు. సీఎం ఆదేశాలతో టిడ్కో ఇళ్లను కూడా లబ్దిదారులకు అందజేస్తున్నామని నిర్దేశించిన గడువులోగా తప్పనిసరిగా ఇల్లు కేటాయింపు, రిజస్ట్రేషన్ ప్రక్రియ కు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ స‌మావేశంలో రాష్ట్ర పుర‌పాల‌క‌శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ ప్రవీణ్‌కుమార్‌, స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ పి.సంప‌త్‌కుమార్‌, ఏపీయూఎఫ్ఐడీసీ శ్రీ జి.ల‌క్ష్మీషా, విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిక‌ల్ దిన‌క్ పుండ్క‌ర్‌, ప్ర‌జారోగ్య‌శాఖ ఇంజినీరింగ్ ఇన్ ఛీఫ్ పి.ఆనంద‌రావు, రాష్ట్రంలోని అన్ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్లు, ఉన్న‌తాధికారులు, అధికారులు హాజ‌ర‌య్యారు.
తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకున్న గౌ. భారత రాపతి
నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన "ఖిద్మత్ టీం"...
విద్య,వైద్యం,సామాన్య ప్రజలకు అండగా ఉండడంపైనే ప్రధాన దృష్టి : ఆర్థిక మంత్రి బుగ్గన...
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్థిక...
AP NUMVER 2 IN EDUCATION...see the link rajadhanivartalu.com
సీఎం ఆదేశాలమేరకు రాజులపూడి ఆరుద్రతో మరోసారి సమావేశమైన సీఎంఓ అధికారులు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌.
పుంగనూరులో ఐటిఐ కళాశాలలో స్కిల్ హబ్ ను ప్రారంభించిన గౌ.రాష్ట్ర అటవీ విద్యుత్,పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి..
సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎం వై.ఎస్. జగన్ స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారు..
విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఆయుర్వేద శాస్త్రంలో శస్త్ర చికిత్సలు, ఆధునిక పరిణామాలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :163495                      Contact Us || admin@rajadhanivartalu.com