తాజా వార్తలు బడ్జెట్లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం...         ఈ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తోంది...         తారీకు : 08-12-2022
 
ఆక్వా సెక్టార్ ఇప్పుడు దేశానికీ గ్రోత్ ఇంజిన్ లాంటిది
విజయవాడ,
తేది : 12.10.2022.

ఆక్వా సెక్టార్ ఇప్పుడు దేశానికీ గ్రోత్ ఇంజిన్ లాంటిది
• నవంబర్ 4, 5, 6 తేదీల్లో భీమవరంలో ఆక్వా ఎక్స్ ఇండియా 2022 నిర్వహణ
• ఆక్వారంగంలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది.
• ఈ నెల 28న షిషరీస్ వర్సిటీకి సీఎం వై.ఎస్. మోహన్ రెడ్డి శంకుస్థాపన..
• మంత్రి సీదిరి అప్పల రాజు వెల్లడి..

దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ నుంచి 70 శాతం మత్స్య సాగు ఉత్పత్తి అవుతోందని, ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆక్వా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఆక్వా రంగంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించి సన్న, మధ్యతరహా రైతులను ఆదుకోవాలనే ఆలోచనతో విద్యుత్ సరఫరా సబ్సిడీ పై ఇస్తున్నారన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన ఆక్వా ఎక్స్ ఇండియా 2022 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నవంబర్ 4, 5, 6 తేదీల్లో భీమవరం ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆక్వా రంగానికి మేలు జరిగేలా ఫిషరీస్ వర్శిటీని అందుబాటులోకి తెస్తున్నామని, ఈ నెల 28న ఫిషరీస్ వర్శిటీకి సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఆక్వా సెక్టార్ ఇప్పుడు దేశానికీ గ్రోత్ ఇంజిన్ లాంటిదని అన్నారు. దేశం మొత్తం మీద 70 శాతం ఆక్వా కల్చర్ ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటోందని తెలిపారు. రాష్ట్రంలో ఆక్వా రంగం పై 17 లక్షల మందికి ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రంగంలో కూడా ఏపి సీడ్ యాక్ట్ వంటి సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. ఆక్వా రంగానికి జగనన్న ప్రభుత్వం అన్ని విధాల చేయూత అందిస్తోందని, షిషరీస్ వర్సిటీని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని, నక్కపల్లి దగ్గర ఆక్వా కోసం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలు దేశానికే కాక, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి తెలిపారు. రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని, సీఎం వై.ఎస్. జగన్‌ దార్శనికత, ఆలోచనలు క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలవుతున్నాయని.. ఇథియోఫియా దేశంలో కూడా ఆర్బీకేల ఏర్పాటు సన్నద్దమవుతున్నాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆర్బీకేల ద్వారా విత్తనం నుంచి పంట విక్రయం వరకూ ఎలాంటి సేవలు అందుతున్నాయో.. అలాగే ఆక్వారంగంలో కూడా అటువంటి సేవలు అందేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. భీమవరంలో నిర్వహించే ఆక్వా ఎక్స్ సదస్సు ఆక్వా రైతులకు మంచి దిక్సూచిలా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎన్. సందీప్ వర్మ, ఏ. జ్ఞాన ప్రకాష్ లను మంత్రి అభినందించారు. ఆక్వా రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం సాగులో ఇబ్బందులు పరిష్కరించే విధంగా, ఆక్వా రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలపై ఆక్వా రైతులు అవగాహన కల్పిస్తామన్నారు.

క్షత్రియ కార్పోరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు మాట్లాడుతూ... జగనన్న ప్రభుత్వంలో 10 ఎకరాలలోపు ఆక్వా రైతులందరికీ విద్యుత్ యూనిట్ కి రూపాయి యాబై పైసలకే అందివ్వడం చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఆక్వా రంగంలో అవగాహన కోసం ఆక్వా ఎక్స్ ఫో నిర్వహించడం అభినందనీయమన్నారు. టైగర్, ఒనామి తర్వాత ఇఫ్పుడు మరో కొత్తరకం సీడ్ తీసుకురావాల్సిన అవసరం ఉందని.. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని రైతుల తరపున సర్రాజు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆఫ్కాఫ్ ఛైర్మన్ అనిల్ బాబు, వడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ గాయత్రి సంతోషిని, ఆక్వా ఎక్స్ ఇండియా సీఈవో వేణు దంతులూరి, సోసైటీ ఇండియన్ ఫిషరీస్ అండ్ ఆక్వా కల్చర్ (సైఫా) అధ్యక్షులు వి. రామచంద్ర రాజు, ఆక్వా ఎక్స్ డైరెక్టర్లు సమీర్ పాత్ర, ఎన్. సందీప్ వర్మ, ఏ. జ్ఞాన ప్రకాష్, పలువురు ఆక్వా ఎక్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకున్న గౌ. భారత రాపతి
నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన "ఖిద్మత్ టీం"...
విద్య,వైద్యం,సామాన్య ప్రజలకు అండగా ఉండడంపైనే ప్రధాన దృష్టి : ఆర్థిక మంత్రి బుగ్గన...
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్థిక...
AP NUMVER 2 IN EDUCATION...see the link rajadhanivartalu.com
సీఎం ఆదేశాలమేరకు రాజులపూడి ఆరుద్రతో మరోసారి సమావేశమైన సీఎంఓ అధికారులు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌.
పుంగనూరులో ఐటిఐ కళాశాలలో స్కిల్ హబ్ ను ప్రారంభించిన గౌ.రాష్ట్ర అటవీ విద్యుత్,పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి..
సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సీఎం వై.ఎస్. జగన్ స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారు..
విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఆయుర్వేద శాస్త్రంలో శస్త్ర చికిత్సలు, ఆధునిక పరిణామాలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :163444                      Contact Us || admin@rajadhanivartalu.com