తాజా వార్తలు బడ్జెట్లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం...         ఈ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తోంది...         తారీకు : 08-12-2022
 
ట్రంప్‌ కుట్రలు...
ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి ట్రంప్‌ కుట్రలు

ఆయన ఆటలు సాగనివ్వం: బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఆయన మద్దతుదారులు కుట్రలు పన్నుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరోపించారు. అధికారం దక్కించుకోవడానికి దుర్బుద్ధితో రాజకీయ హింసను ఎగదోస్తున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని, తగిన గుణపాఠం నేర్పాలని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తీవ్రవాదులను’ కచ్చితంగా ఎదిరించాలని చెప్పారు. ఫిలడెల్ఫియాలోని ప్రఖ్యాత ఇండిపెండెన్స్‌ హాల్‌లో బైడెన్‌ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రతిపక్ష రిపబ్లికన్లపై విరుచుకుపడ్డారు. ట్రంప్‌ మద్దతుదారుల అజెండా అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పేనని తేల్చిచెప్పారు. వారి దుశ్చర్యల వల్ల సమానత్వం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, అధికారమే పరమావధిగా భావిస్తున్నారని ధ్వజమెత్తారు. డొనాల్డ్‌ ట్రంప్, ఆయన అనుచరుల ఆటలు సాగవని హెచ్చరించారు. నాయకుడి పట్ల గుడ్డిగా విధేయత ప్రకటించడం, రాజకీయ హింసలో పాల్గొనడం వంటివి ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తాయన్న సత్యాన్ని చరిత్ర మనకు నేర్పుతోందని బైడెన్‌ ఉద్ఘాటించారు.
ట్రంప్‌ కుట్రలు...
మహా విపత్తుకు ముందస్తు సూచికే.. .
* రష్యాకు ఆ నైతిక హక్కు లేదు...
* పైలట్లు ఇద్దరూ నిద్రపోయారు...
* అమెరికాలో సెటిల్‌ కావడానికి ప్లాన్‌ చేసిన - గొటబయా రాజపక్స!
* తెరపైకి మదర్‌ హీరోయిన్‌.. అప్పుడు స్టాలిన్‌-ఇప్పుడు పుతిన్‌..
దిమాక్ ఖరాబ్ చేస్తున్న కరోనా: తగ్గి నెలలు గడుస్తున్నా.. ఏదీ గుర్తుండట్లేదు, చిరాకు జిందగీ!
* నడి రోడ్డు పై సొమ్మసిల్లి పడిపోయిన గుర్రం...
* తుపాకీతో తూటాల వర్షం కురిపించి విధ్వంసం...
* జాన్సన్‌ బేబీ పౌడర్‌ ఇక దొరకదు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :163471                      Contact Us || admin@rajadhanivartalu.com