తాజా వార్తలు బడ్జెట్లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం...         ఈ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తోంది...         తారీకు : 08-12-2022
 
సినిమా వార్తలు
  సినిమా ట్రైలరు
  లఘు సినిమాలు
  పూర్తి సినిమాలు
  సినిమా పాటలు
  విచిత్ర చిత్రాలు
 
సడన్‌గా ఈ మార్పు ఏంటి? What is this Sudden Change !?
సమంతలో సడన్‌గా మార్పు ఏంటి అనే ప్రశ్న సినీ వర్గాల్లో తలెత్తింది. తెలుగు, తమిళం భాషల్లో అగ్ర నటిగా రాణిస్తున్న నటి సమంత. కోలీవుడ్‌లో నటిగా తొలి అడుగులు వేసిన ఈ అచ్చ తమిళ అమ్మాయి ఏ మాయ చేసావే చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్ర సక్సెస్‌తో ఆమెకు నటిగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.

అక్కడ పవన్‌ కళ్యాణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ వంటి టాప్‌ హీరోల సరసన నటిస్తూ క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్‌ కథాచిత్రాల్లోనూ నటిస్తున్న సమంత గ్లామర్‌ విషయంలో ముందు నుంచి పాజిటివ్‌ గానే ఉంటూ వస్తున్నారు. వివాదాస్పద పాత్రలో నటించడానికి ఎప్పుడు వెనుకడుగు వేయలేదు. తమిళంలో సూపర్‌ డీలక్స్‌ చిత్రంలో అలాంటి సంచలనాత్మక పాత్రని చేసి వార్తల్లోకెక్కారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెన్‌ వెబ్‌ సిరీస్‌లో ఇంకాస్త శృతిమించి నటించారు.

తన భర్త నాగచైతన్య నుంచి విడిపోవడానికి ఆ వెబ్‌ సిరీస్‌ ఒక కారణమనేది ప్రచారంలో ఉంది. ఇకపోతే ఆ మధ్య పుష్ప చిత్రంలో ఊ అంటావా మామ అంటూ అందాల ఆరబోతతో రెచ్చిపోయారు. ఇక తరచూ గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ నెటిజన్లకు చేతినిండా పని చెబుతున్నారు. అలాంటి సమంత తాజాగా అభిమానులకు షాక్‌ ఇచ్చే నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇకపై కొత్త చిత్రాల్లో గ్లామరస్‌గా నటించేది లేదని, అలాగే సామాజిక మాధ్యమాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు, టాక్‌. ఇకపై చిత్రాల్లో హీరోలతో అత్యంత సన్నిహితంగా ఉండే సన్నివేశాల్లో నటించనని, అరకొర దుస్తులు ధరించేది లేదని తన వద్దకు కథలు చెప్పడానికి వచ్చే దర్శకులకు కొత్త షరతులను విధిస్తున్నట్లు సమాచారం. హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టంగా చెబుతున్నట్లు సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే ఇందులో నిజం ఎంత అన్నది సమంత స్పందిస్తేనే తెలుస్తుంది.
కొత్త సినిమాలు
సడన్‌గా ఈ మార్పు ఏంటి? What is this Sudden Change !?
'జీవితంలో తోడు కావాలి'.. రేణుదేశాయ్‌...
మాస్‌ యాక్షన్‌ స్టార్ట్‌
యాక్టింగ్‌కు గుడ్‌బై!.. నయనతార అభిమానుల్లో టెన్షన్‌..
అలా సినిమా చాన్స్‌ వచ్చింది...
*** లైగర్‌ ఫ్లాప్‌తో బాధలో విజయ్‌, కాలర్‌ ఎగరేసే రోజులొస్తాయంటున్న ఫ్యాన్స్‌
* 'ఆ స్టార్‌ హీరో పెళ్లి చేసుకోమన్నాడు.. అలాంటి రూమర్స్‌ విన్నా'
> అన్ని కోట్లు డిమాండ్‌ చేస్తుందట!!!
** ‘అమ్మనాన్నకు డేటింగ్‌ అంటే నచ్చదు, కానీ నేను అలా కాదు’
మాది టీవీ షోస్‌ కోసం పుట్టిన ప్రేమ కాదు'.. ఫిదా అయిన సుజాత
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :163509                      Contact Us || admin@rajadhanivartalu.com